విజయసాయి రెడ్డికి స్మూత్ కౌంటర్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడు..!

Wednesday, January 27th, 2021, 07:36:46 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్మూత్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరినా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పంతంతో ఎన్నికలు నిర్వహించి తీరుతున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే విజయసాయి విమర్శలపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సూటి ప్రశ్న వేశారు.

కరోనాతో ప్రజలు ఇబ్బంది పడితే నిమ్మగడ్డడే బాధ్యత అంటున్న అతి మేధావి విజయసాయిరెడ్డికి నా సూటి ప్రశ్న అంటూ కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ 7,150 మంది మరణించారు, 8 లక్షల 87 వేల మంది కరోనాతో ఇబ్బంది పడ్డారు. వీటికి జగన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా అని ప్రశ్నించారు. మీ లెక్కల్లోనే ఇవి ప్రభుత్వ హత్యలు కాబట్టి 7,150 కుటుంబాలకు 50 లక్షలు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకుంటుందా సాయిరెడ్డి? ఎన్నికలకు భయపడటం లేదు అన్న నీ స్టేట్మెంట్ లోనే భయం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.