సజ్జలకు అల్టీమేట్ కౌంటర్ ఇచ్చిన అయ్యన్న పాత్రుడు..!

Sunday, March 28th, 2021, 01:39:37 AM IST

ఏపీ ప్రభుత్వ సలహదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అల్టీమేట్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆమోదంతో ల్యాండ్‌ పూలింగ్‌ చేపడితే, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందనడం విడ్డూరమని అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ..రెండేళ్లుగా అంటున్నారే తప్ప ఇప్పటి వరకు నిరూపించలేకపోయారని అన్నారు. విశాఖలో వైసీపీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కి పాల్పడిందని వైసీపీ నేతలకు దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని అయ్యన్న సవాల్ విసిరారు.

ఇదిలా ఉంటే అంతకుముందు అమరావతిలో జరిగిన ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవహారం ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పేదల భూములను టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారన్నారు. అసైన్డ్‌ భూములను బెదిరించి తీసుకున్నారని దీని వల్ల చంద్రబాబు ఆయన బినామీలకు మేలు చేకూరిందని అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే సీఐడీ విచారణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.