ఏపీ మంత్రి కుమారుడిపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు..!

Friday, September 18th, 2020, 08:00:03 PM IST

ayyanna_pathrudu

ఏపీ కార్మికశాఖ మంత్రి జయరాం కుమారుడిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. మంత్రి జయరాంకు ఓ కేసులో ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని, అయితే ఆ వ్యక్తి మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు బెంజి కారు లంచంగా ఇచ్చాడని ఆరోపించారు. అయితే ముద్దాయికి, మంత్రి కుమారుడికి సంబంధమేంటో తేల్చాలని డిమాండ్ చేశారు.

అయితే మంత్రికి బినామీ కాబట్టే ఆయన కొడుకుకి ముద్దాయి బెంజి కారును ఇచ్చాడని, అది పుట్టిన రోజు కానుక కాదు లంచం అని అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చాడు. ఈ విషయమై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరాడు. అంతేకాదు అవినీతి నిరోధక శాఖ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అందులో మంత్రి జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ హస్తముందని ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి నేను సిద్దంగా ఉన్నానని తన ఫిర్యాదుపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపాడు.