అటువంటి క్రిమినల్ బుర్ర నీ అల్లుడుది విజయసాయి రెడ్డి – టీడీపీ నేత

Sunday, October 11th, 2020, 11:00:55 PM IST

తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు మరోమారు అధికార పార్టీ పై ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తే హత్య చేసి సహజ మరణం అంటూ మాయ చేసే క్రిమినల్ బుర్ర నీ అల్లుడు గన్నేరు పప్పుద విజయసాయి రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టీ పెద్ద రోగం తో పోయినొడు కూడా మహా మేత కోసం పోయాడు అంటూ ఓదార్పు యాత్ర లు చేసి ముసలి కన్నీరు కార్చిన తింగరి మాలోకము నీ అల్లుడు అంటూ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైతులు మంచి షర్ట్ వేసుకోకూడదు అనే ముదనష్టపు బుర్ర నీ అల్లుడు ది అని ఘాట్ విమర్శలు చేశారు. రైతు మరణాన్ని కూడా హేళన చేసే నీలాంటి చిల్లర బ్యాచ్ కి పోయే రోజు దగ్గర్లో ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజదాని అమరావతి పోరాటం మూడు వందల రోజు చేరుతుండటంతో అటు టీడీపీ నేతలు అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఉండగా, వైసీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.