జనం తద్దినము పెట్టే రోజు దగ్గరపడింది.. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కామెంట్స్..!

Tuesday, March 30th, 2021, 02:00:03 AM IST

ఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని టచ్ చెయ్యాలి అనుకుని ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిన మహమేత ఆపరేషన్ వికర్ష్ స్కీంలో అంతర్ధానం అయిపోయాడని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇప్పుడు తనయుడు తుక్కు రెడ్డి వచ్చి మొదలెట్టాడని ఎద్దేవా చేశాడు.

అయితే శివ కుమార్ పార్టీని కబ్జా చేసిన 10 ఏళ్లలో కుటుంబ సభ్యుల్లో కొంతమందిని లేపేసి మరికొంతమందిని తరిమేసి తాడేపల్లి కొంపలో వనవాసం చేస్తున్నాడని, నేరగాళ్ళు స్థాపించిన నిందితుల పార్టీకి జనం తద్దినము పెట్టే రోజు దగ్గరపడింది విజయసాయి రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నికల నేపద్యంలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.