మీ పులివెందుల పిల్లిని పోటీకి దింపినా ఓకే

Saturday, August 22nd, 2020, 07:02:29 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ల పై తాజాగా జోగి రమేష్ పలు ఘాటు విమర్శలు చేశారు. అయితే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకి గానూ తెలుగు దేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. జోగి ముందు మీ గన్నేరుపప్పు ను లైవ్ లోకి తీసుకురా ఎవడి సత్తా ఏంటో తేలిపోతుంది అని అన్నారు.

తెలుగు కి తెగులు పట్టిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మీ వాడు చేసిన పదవిన్యాసం ఇంకా మర్చిపోలేక పోతున్నాం అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ముందు మీ వాడికి అ, ఆ లు నేర్పు జోగి అంటూ ఘాటు విమర్శలు చేశారు. అన్నట్టు వాలంటీర్ ను పెట్టీ గెలిపిస్తావా మరి మీ పులివెందుల పిల్లి ఏంటి టీడీపీ ఎమ్మెల్యే కూవో కండువా కప్పుతుంది అంటూ సెటైర్ వేశారు. మీ నాయకుడికి దమ్ముంటే పార్టీ లో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి వాలంటీర్ లని పోటీ లో పెట్టండి లేదా మీ పులివెందుల పిల్లి ను పోటీకి దింపినా ఓకే అంటూ ఘాటు విమర్శలు చేశారు.