ఏ కుట్రా లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి

Friday, February 5th, 2021, 02:38:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖ ఉక్కు కర్మాగారం కి దేశ వ్యాప్తంగా పేరు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నేడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతుంది అనే వార్త అందరినీ కూడా షాక్ కి గురి చేస్తోంది అంటూ తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు అంటున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఈ విషయం లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర విధ్వంసానికి కుట్రలు పన్నుతున్న ఏ 1, కొత్త ఏ 2, పాత ఏ 2 ఇప్పుకు ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై కన్నేశారు అంటూ చెప్పుకొచ్చారు. 20 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ను కొట్టేయడానికి ఈ దొంగల ముఠా స్కెచ్ వేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే బినామీ కంపెనీ చేత ఈ స్టీల్ ప్లాంట్ కొనబోతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇందులో ఎటువంటి కుట్ర లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి అంటూ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చాటి చెప్పాలి అంటూ చెప్పుకొచ్చారు. ఆర్టీసి ను ప్రభుత్వం లో విలీనం చేసిన వాళ్ళు వెయ్యి కోట్ల తో స్టీల్ ప్లాంట్ కొనలేరా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అన్నారు. ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించాం అని అన్నారు. అయితే సొంత గనులు లేవని, 100 శాతం ప్రైవేట్ పరం చేయడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచన సరైంది కాదు అని, దీని పై జగన్ స్పందించాలి అని, ప్రధానిని కలిసి ప్రైవేట్ పరం కాకుండా చూడాలి అని కోరారు. అవసరము అయితే ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకొనేందుకు రాజీనామా లకు సిద్దం కావాలంటూ పిలుపు ఇచ్చారు.