నాని కోసం వెళితే అ ! నాని కూడా కలుస్తాడు !

Monday, February 19th, 2018, 06:27:04 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోలు సరికొత్త ప్రయోగాలు చేయడానికి ముందుంటారు అని నాని నిరూపించాడు. కథ నచ్చితే నిర్మాతగా బాధ్యతలు కూడా తీసుకుంటారని చేసి చూపించాడు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు మొదటి చేపకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్ననాని ఆ తరువాత అ! సినిమానే నిర్మించాడు. అయితే సినిమా మంచి టాక్ తో దూసుకువెళుతోంది. ఇక అసలు విషయానికి వస్తే సినిమాలో నాని అ! చేపకు ఇచ్చిన వాయిస్ ఓవర్ చాలా వరకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఆ చేప చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. అందరికి ఎక్కువగా నాని చేప డైలాగులు నచ్చాయి. ఇక ఇప్పుడు ఆ చేప ఎక్కడుంది అనే అనుమానం అందరికి రావచ్చు. ప్రస్తుతం నాని చేప నాని దగ్గరే ఉంది. షూటింగ్ కోసమని తెచ్చిన ఆ స్పెషల్ చేపను నాని అలానే తన దగ్గర ఉంచుకున్నాడు. దానికోసం ప్రత్యేకమైన అక్వేరియం సెటప్ చేసి తన ఆఫీస్ లో పెట్టుకున్నాడు. అ! నాని కోసం కొందరు నటీనటులు స్పెషల్ గా కలవడానికి వెళుతున్నారట. నాని కోసం వెళితే అ! నానిని కూడా కలవవచ్చన్నమాట.