అభిషేక్ బచ్చన్ కు నో చెప్పిన భామలు?

Wednesday, February 18th, 2015, 05:10:03 PM IST


బాలీవుడ్ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ పక్కన నటించేందుకు బుల్లితెర నటీమణులు తిరస్కరించారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాగా పెద్ద పెద్ద తారలు సైతం స్టార్ హీరో అభిషేక్ పక్కన నటించడానికి ఆసక్తి చూపుతుంటే కలర్స్ టెలివిజన్ లో ప్రసారమయ్యే ‘ససురాల్ సిమర్ కా’ ధారావాహికలోని అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్న అవికా గోర్, దీపికా శాంసన్ మాత్రం ససేమిరా అన్నారట.

వివరాలలోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ పర్సనాలిటీ ఫరా ఖాన్ హోస్ట్ గా చేస్తున్న ‘ఫరా కీ ధావత్’ వంటల కార్యక్రమంలో నటుడు అభిషేక్ బచ్చన్ తనకు ఇష్టమైన వంటను వండి వార్చనున్నాడు. కాగా ఈ కార్యక్రమంలో అభిషేక్ పక్కన కనిపించడానికి ఈ సీరియల్ అక్కాచెల్లెళ్ళను సంప్రదించగా భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేశారట. ఇక ఇలాంటి చాన్స్ అస్తమాను రాదని ప్రొడ్యూసర్లు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా అవికా, దీపికా మాత్రం తమ సమాధానం నో అనే చెప్పారని సమాచారం.