చంద్రబాబు ఇప్పటికైనా ఊహాల్లోంచి బయటికి రావాలి

Friday, August 28th, 2020, 05:09:11 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కి ప్రతి పక్ష హోదా ఇచ్చింది ఉత్తరాంధ్ర అని అన్నారు. విశాఖ లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి అని అన్నారు. అలా వెళ్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలిసిపోతుంది అని అవంతి శ్రీనివాస్ అన్నారు.

అయితే చంద్రబాబు ఇప్పటికైనా ఊహల్లోంచి బయటకు రావాలి అని విమర్శించారు. అధికారం. లో ఉన్నప్పుడు ప్రైవేట్ గెస్ట్ హౌస్ లకి 23 కోట్ల రూపాయల ను చెల్లించారు అని తెలిపారు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్ కట్టేందుకు చంద్రబాబు అడ్డుపడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అమరావతి లో రాజధాని బిల్డింగ్ లకు మాత్రం 30 వేల ఎకరాలు సేకరించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకి టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.