బిగ్ వైరల్: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆటో ఏరియల్ సర్వే..!

Tuesday, August 18th, 2020, 12:57:17 PM IST

Seethakka

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మరో సారి తన మానవత్వం చాటుకున్నారు. కరోనా కష్ట కాలంలో అడవులలో నివస్తిస్తున్న ఆదీవాసీలకు అడవుల గుండా నడుచుకుంటూ వెళ్ళీ మరీ తన వంతు సాయాన్ని అందించి అందరితో శభాష్ అనిపించుకున్న సీతక్క మరో సారి వార్తల్లోకి ఎక్కారు.

తాజాగా గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ములుగు జిల్లాలో కూడా చాలా గ్రామాలు నీట మునిగాయి. అయితే వరదలు సంభవించినప్పుడు రాజకీయ నాయకులు హెలికాప్టర్‌ల ద్వారా ఏరియల్ సర్వేలు చేస్తుండడం చూస్తుంటాం. అయితే తన నియోజకవర్గంలో వరదల కారణంగా జరిగిన ఆస్తి, పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యే సీతక్క ఆటోలో ఎక్కి ఏరియల్ సర్వే నిర్వహించింది. అంతేకాదు మోకాటి లోతు నీటిలో నడుస్తూ కూడా వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించారు. దీంతో తన నియోజకవర్గానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.