బిగ్ న్యూస్: ప్రగతి భవన్ ఎదుట ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!

Friday, September 18th, 2020, 12:56:22 PM IST

హైదారాబాద్‌లోని ప్రగతి భవన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. మెయిన్ రోడ్డుపై ఉన్న గేటు ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడి శరీరంపై నీళ్ళు చల్లి కాపాడారు.

అయితే తెలంగాణ ఉద్యమంలో తాను కూడా చురుగ్గా పాల్గొన్నానని, 2010లో అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నట్టు తెలిపాడు. అయితే ప్రత్యేక తెలంగాణ వచ్చినా తమ కష్టాలు ఇంకా తీరడం లేదని, ఇప్పటి వరకు తమకు ఇళ్లు కూడా మంజూరు చేయలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు అతడని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇటీవలే ఆర్థిక ఇబ్బందుల వలన రవీంద్రభారతి ఎదుట ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగలేదని, జై తెలంగాణ.. కేసీఆర్ సార్ అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.