‘రోహిత్’ కాదు.. ‘కోహ్లీ’ కొట్టినా మ్యాచ్ గెలవలేదు

Sunday, January 17th, 2016, 05:33:00 PM IST

aus-ind
ఐదు మ్యాచ్ ల వీబీ సిరీస్ లో జరిగిన రెండు మ్యాచుల్లో భారత్ ఓడిపోయింది. ఈ రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ వీరబాదుడు బాది రెండు వరుస సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక మూడో మ్యాచ్ చూస్తే ఈసారి రోహిత్ ఔటయ్యాడు కోహ్లీ బ్యాట్ ఘుళిపించాడు. 117 బంతుల్లో 117 పరుగులు చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచి 3 – 0 తో సిరీస్ ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో భారత్ తరపున ధావన్ 91 బంతుల్లో 68, కోహ్లి 117 బంతుల్లో 117, రహానే 55 బంతుల్లో 50 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా బౌలర్ హస్టింగ్స్ 4 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తరపున మాక్స్ వెల్ 83 బంతుల్లో 96, షాన్ మార్ష్ 73 బంతుల్లో 62, స్మిత్ 45 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక భారత బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, జడేజాలు తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఆస్ట్రేలియా 3 – 0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.