టీమిండియా టార్గెట్ 328 పరుగులు…సత్తా చాటిన బౌలర్లు

Monday, January 18th, 2021, 12:49:58 PM IST

ఆస్ట్రేలియా తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా బౌలర్లు తమ సత్తా చాటారు. సిరాజ్ ఐదు వికెట్లు తీసి 73 పరుగులు ఇవ్వగా, శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసి 61 పరుగులు ఇచ్చాడు. అయితే ఆసీస్ తమ రెండవ ఇన్నింగ్స్ లో 294 పరుగులకు ఆల్ ఔట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో ఉన్న పరుగులతో కలిపి టీమ్ ఇండియా కి 328 పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసింది. అయితే బౌలర్లు దీటు గా బౌలింగ్ చేస్తున్నప్పటికీ ఆసీస్ బ్యాట్స్ మన్ ఎక్కువ పరుగులు రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆసీస్ లో వార్నర్ 48 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 55 పరుగులు చేశాడు.

అయితే రెండవ ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటింగ్ లో రాణిస్తే గెలుపొందే అవకాశం ఉండగా, నిలకడగా ఆడితే డ్రా గా ముగిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలుపుతో ఇరు జట్లు సీరీస్ ను సొంతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.