బాక్సింగ్ డే టెస్ట్: 195 పరుగులకు ఆసీస్ ఆలౌట్

Saturday, December 26th, 2020, 01:40:28 PM IST

టీమ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 195 పరుగులకు కుప్పకూలింది. టీమ్ ఇండియా బౌలింగ్ లో ఉత్తమ్ ప్రదర్శన కనబరచడం తో ఆసీస్ 195 పరుగులు మాత్రమే చేయగలిగింది.అయితే ఆస్ట్రేలియా టీమ్ లో వేడ్ అత్యధిక స్కోర్ సాధించాడు. 48 పరుగులతో ఈ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెడ్ 38 పరుగులు చేశాడు. అయితే టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం లో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కి టీమ్ ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ఆదిలోనే బుమ్ర ఓపెనర్ బర్న్స్ ను డకౌట్ గా పెవిలియన్ కి పంపాడు. అయితే స్మిత్ ను మాత్రం అశ్విన్ డకౌట్ గా పెవిలియన్ కి చేర్చి ఆసీస్ కి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వరుస గా గ్యాప్ లేకుండా బ్యాటింగ్ పార్టనర్ షిప్ ను బ్రేక్ చేయడం తో భారత్ కెప్టెన్ రహానే సారథ్యం లో భారత్ బౌలింగ్ పర్ఫామెన్స్ అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.