తెల్ల భామలనే ఇష్టపడుతున్నారు!

Monday, April 6th, 2015, 12:08:47 PM IST

sweetha-thivari
బాలీవుడ్ నటీమణి శ్వేతా తివారీ ప్రస్తుత కాలంలో తెల్లగా ఉన్న కదానాయకులను మాత్రమే ప్రేక్షకులు ఇష్టపడుతున్నరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ప్రేక్షకులకు ఇలాంటి ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందని శ్వేత అభిప్రాయపడ్డారు. ఇక హీరోయిన్ తెల్లగా ఉంటేనే ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తున్నారని, కధానాయికలు నల్లగా ఉంటే చూసేందుకు ఇష్టపడడం లేదని, వారి ఆలోచన ఖచ్చితంగా మారాలని స్పష్టం చేశారు.

అలాగే భారతీయులు కేవలం తెల్లగా ఉన్నవారిని మాత్రమే అందగత్తెలుగా పరిగణిస్తున్నారని, నల్లని దేహంతో ఆకట్టుకునే రూపురేఖలు ఉన్న వారిని ఆకర్షణీయమైన వారిగా గుర్తించడం లేదని శ్వేత వాపోయారు. ఇక హిందీ సినిమాలలో కధానాయిక ఆత్మ సౌందర్యానికి సైతం విలువిస్తారని, కానీ ప్రేక్షకులు వారిని ఇష్టపడరని శ్వేతా తివారీ చెప్పుకొచ్చారు.