దారుణం : తల్లితో పాటు కూతురుపైనా అఘాయిత్యం…?

Friday, February 14th, 2020, 01:09:20 AM IST

ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తమ కుటుంబం లోని లోపాలను చేసుకొని వారి ఇంటిలోకి వచ్చిన ఒక తాంత్రికుడు ఒక దారుణమైన ఘోరానికి పాల్పడ్డాడు. కాగా వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని షహనాజ్‌పూర్‌ జిల్లాలో ఖుతారు గ్రామానికి చెందిన ఒక కుటుంబం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆ ఇంటి పెద్ద దిక్కుకి కొన్ని పీడ శక్తులు ఆవహించాయని, అవి వదిలిస్తే మీ కుటుంబం ఎప్పటిలాగే బాగుపడుతుందని చెప్పి ఔరంగాబాద్‌కు చెందిన ఓ తాంత్రికుడు సాగిర్ ఖాన్‌ నమ్మబలికాడు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9న పూజల కోసం వారి ఇంటికి ఒక సహాయకుడితో సహా వెళ్లి పూజలు చేస్తున్నానని నమ్మబలికి, అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని ఒక గదిలో బందించి చివరకు ఆ మహిళ మీద అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా వారి 12 సంవత్సరాల కుమార్తె పై కూడా అత్యాచారం చేసి అక్కడినుండి పారిపోయారు. ఆ తరువాత ఘటన నుండి తేరుకున్న ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు సాగిర్ ఖాన్ పై రేప్ కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.