వంద మంది జగన్ రెడ్డిలు వచ్చినా ఏం పీకలేరు – అచ్చెన్నాయుడు

Tuesday, December 22nd, 2020, 12:00:01 AM IST

ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన అచ్చెన్నాయుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే మంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

అయితే చదువుకున్న మూర్ఖుల్లా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని, ఓ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై మంత్రి సీదిరి అప్పలరాజు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. సీదిరి ఇంకా మంత్రిగా ఉండడం సిగ్గుచేటని, వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డికి భజన చేసుకోండని సూచించారు. గౌతు లచ్చన్న గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని వంద మంది జగన్ రెడ్డిలు వచ్చినా లచ్చన్న విగ్రహం పెయింట్ కూడా పీకలేరని అన్నారు.