ఏపీ టీడీపీలో మార్పులు.. కొత్త బాస్ రాబోతున్నాడు..!

Tuesday, September 22nd, 2020, 05:37:16 PM IST

TDP_party

ఏపీ టీడీపీ కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి కసరత్తు చేశాడు. అధికార వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పార్టీలో మరిన్ని మార్పులు చేయాలని భావిస్తూ ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు స్థానంలో ఉత్తరాంధ్ర టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు తెలుస్తుంది.

అయితే ఈ నెల 27న దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. ఇటీవల అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 25 మంది అధ్యక్షుల నియామకం చేపట్టబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని టీటీడీపీ సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. మరీ దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి మరీ.