ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్ట్ చేయడం దారుణం – అచ్చెన్నాయుడు

Monday, December 14th, 2020, 03:04:42 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వెబ్ కౌన్సెలింగ్ పేరుతో ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం రాజకీయం చేయడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీనియారిటీ ను కాదు అని, వైసీపీ తమ వర్గం కోసం నీచమైన చర్యలకు పాల్పడుతుంది అని ఘాటు విమర్శలు చేశారు. అయితే సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఉపాద్యాయులు రోడ్డెక్కి నిరసన తెలిపేలా వైసీపీ సర్కారు చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అందరూ కూడా ఆన్లైన్ బదిలీ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అలా వెళ్ళడం ఎవరికోసం అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే బదిలీ ప్రాంతాల్ని బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్ట్ చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం గా వ్యవహరిస్తూ విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది అంటూ ఆరోపించారు. ఇప్పటికే ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా పాటశాలలు తెరిచి వందలాది మంది టీచర్లు, విద్యార్థులు కరోనా వైరస్ భారిన పడేలా చేశారు అని, తక్షణమే వెబ్ కౌన్సలింగ్ విధానం రద్దు చేసి, మ్యానువల్ విధానాన్ని పునరుద్ధరించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.