ఆధారాలు చూపించగలరా.. వైసీపీ మంత్రులకు అచ్చెన్న సవాల్..!

Thursday, November 5th, 2020, 05:04:34 PM IST

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ మంత్రులకు సవాల్ విసిరారు. ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం 5 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని అన్నారు. ఏపీలో పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే దానికి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని, కోర్టులో కేసులు వేసి ఇళ్లా పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నారని వైసీపీ మంత్రులు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

అయితే టీడీపీకి చెందిన ఏ ఒక్క నేత అయిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కేసులు వేసినట్లు ఆధారాలు ఉంటే వాటిని చూపించి మాట్లాడాలని అచ్చెన్న సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీల భూములను ప్రభుత్వం లాక్కుందని అందుకే వారు కోర్టుకు వెళ్ళారని అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడే ధైర్యం మంత్రులకు లేదని అచ్చెన్న అన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాటి గురుంచి సీఎంకు చెప్పే దైర్యం లేక టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మంత్రులు కాలం వెల్లబుచ్చుతున్నారని అచ్చెన్న చెప్పుకొచ్చారు.