ప్రజల మద్దతు ఉంటే ఎన్నికల విషయం లో భయమెందుకు?

Tuesday, January 12th, 2021, 07:33:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పట్ల హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమీషన్ ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల నిర్వహణ, ప్రజలకు వాక్సిన్ వేయడం లాంటి ప్రక్రియ ఏక కాలంలో కష్టతరం అని కోర్టుకి తెలిపింది. అయితే కోర్టు నిర్ణయం ను స్వాగతిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం అని తెలిపారు. అయితే కోర్టు కి తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికలను అడ్డుకున్నారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ కుట్రలో ఉద్యోగ సంఘాలను కూడా భాగస్వామ్యులను చేశారు అని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల మద్దతు ఉంటే ఎన్నికల విషయం లో భయమెందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే కరోనా ఉంటే అమ్మ వడి సభను వేల మందితో ఎలా నిర్వహించారు అని వరుస ప్రశ్నలు వేశారు.అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ఉండగా తమ అరాచకాలు సాగవు అన్న భయం తోనే అడ్డుకున్నారు అంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.