రాష్ట్రంలో పేదవాడికి ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది – అచ్చెన్నాయుడు

Wednesday, March 24th, 2021, 12:30:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పై రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ ప్రభుత్వం క్విడ్ ప్రో కో లో భాగంగానే ఇసుకను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టింది అంటూ అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రాష్ట్రంలో ప్రకృతి సంపద పేదలకు అందని పరిస్థితి రావడం బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు. అయితే నష్టాల్లో ఉన్న సంస్థకు లబ్ధి చేకూరేలా ఇసుకను ఎలా కట్టబెడతారు అంటూ అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. అంతేకాక రాష్ట్రంలో పేదవాడికి ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది అంటూ అచ్చెన్నాయుడు అవేదన వ్యక్తం చేశారు.

అయితే ప్రజల సంపదను జగన్ ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకు అప్పగించింది అని, అధికార పార్టీ తో సంబంధం ఉన్న, నష్టాల్లో ఉన్న సంస్థకు ఇసుకను కట్టబెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతంలో ఇసుక విరివిగా ఉందన్న ప్రభుత్వం ఇప్పుడు కొరత ఉందని అబద్ధాలు ప్రచారం చేస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇసుక టెండర్ ను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం పట్ల టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.