దొంగలపార్టీకి అక్రమ కేసులు పెట్టడం అలవాటైంది – అచ్చెన్నాయుడు

Friday, March 12th, 2021, 12:35:40 PM IST

అధికార పార్టీ వైసీపీ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు అయ్యాక కూడా కావాలనే టీడీపీ నేతల పై వైసీపీ కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కదిరి లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రోద్బలం తో తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ పై, గుంటూరు 42 వ డివిజన్ తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి బుజ్జి పై హత్యాయత్నం కేసు తో పాటుగా డివిజన్ అధ్యక్షుడు ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి పై అక్రమ కేసులు బనాయించారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నేతల పై పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయక పోతే ఆందోళన కి దిగుతామని హెచ్చరించారు అచ్చెన్నాయుడు. అయితే వైసీపీ పాల్పడిన ఒక్క అక్రమం కూడా పోలీసులకు కనిపించక పోవడం దారుణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రాష్ట్రం లో డీజీపీ, ఎన్నికల కమిషనర్ ఏం చేస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ కి మద్దతు గా ఉన్నారు అనే కుట్ర తో పచ్చని పొలాలనుతగలబెట్టి ఆర్దికంగా చిదిమేస్తున్నారు అని ఆరోపించారు. అయితే తెలుగు దేశం పార్టీ అడ్డుకుంది పోలీసుల విధుల్ని కాదు అని, వైసీపీ రిగ్గింగ్ అంటూ అచ్చెన్నాయుడు అవేదన వ్యక్తం చేశారు. అయితే దొంగల పార్టీ కి అక్రమ కేసులు పెట్టడం అలవాటైంది అంటూ సెటైర్స్ వేశారు. అయితే అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.