అసెంబ్లీలో మంత్రులపై సీరీయస్ అయిన స్పీకర్.. ఎందుకంటే?

Thursday, September 10th, 2020, 04:10:05 PM IST

తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నిబంధనలను మరియు జాగ్రత్తలను పాటిస్తూ సమావేశాలు కొనసాగిస్తున్నారు. అయితే సభలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెబుతున్నా సభలో మంత్రులు ఈటెల రాజేందర్‌, జగదీష్‌రెడ్డిలు మాత్రం వాటిని బ్రేక్ చేశారు.

అయితే సీటింగ్ విధానంలో దూరం పాటించేలా ఉండేందుకు నో సీటింగ్‌ అని రాసి ఉన్నా అది పట్టించుకోకుండా జగదీష్‌రెడ్డి మంత్రి ఈటల రాజేందర్ పక్కనే కూర్చొని మాట్లాడారు. దీనిని గమనించిన స్పీకర్ పోచారం మంత్రులపై సీరియస్ అయ్యారు. నో సీటింగ్‌ అని రాసి ఉన్న దానిలో ఎలా కూర్చుంటారంటూ మంత్రి జగదీష్‌ రెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు. స్పీకర్‌ హెచ్చరికలతో జగదీష్‌రెడ్డి వెంటనే మంత్రి ఈటల దగ్గరి నుంచి లేచి తనకు కేటాయించిన సీటులోకి వెళ్ళిపోయారు. అయితే సభలో సభ్యులంతా కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని స్పీకర్‌ పోచారం మరోసారి స్పష్టం చేశారు.