ఎస్ఈసీ నిమ్మగడ్డ కి అసెంబ్లీ నుండి నోటిసులు

Thursday, March 18th, 2021, 04:36:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ప్రీవిలైజ్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి అసెంబ్లీ నుండి నోటీసులు జారీ చేయడం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు పై వివరణ ఇవ్వాలని నోటిసులు ఇవ్వడం జరిగింది. అయితే విచారణకు అందుబాటులో ఉండాలి అని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 19 నుండి 22 వరకూ సెలవు పై వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరిన సంగతి తెలిసిందే. అయితే నోటీసులు జారీ తో సెలవు పై వెళ్లేందుకు అడ్డంకి గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఇటు ఎన్నికల కమిషనర్ కి రాష్ట్ర ప్రభుత్వం కి మధ్య ఈ వివాదం ముడురుతున్నట్లు తెలుస్తోంది.