ఆ వాహనాలతో భక్తులు తిరుమల కి రావొద్దు

Friday, November 6th, 2020, 08:30:10 AM IST

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వస్తూనే ఉంటారు. అయితే పలు వాహనాలను తిరుమలకు రావొద్దు అంటూ ఏ ఎస్పీ మునిరామయ్య కోరారు. పదేళ్లు కాలపరిమితి దాటిన వాహనాలు రావొద్దు అంటూ భక్తుల్ని కోరడం జరిగింది.

అయితే తిరుమల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ముణిరామయ్య మాట్లాడుతూ, తిరుమల లో నో హరన్ జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలిపిరి వద్ద కాలపరిమితి దాటిన వాహనాలను కొండపైకి రాకుండా అవగాహన కల్పిస్తున్నాం అని వివరించారు. సరైన ఫిట్నెస్ లేని వాహనాలతో ఘాట్ రోడ్ పై ప్రయాణం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే కొండపై కి వెళ్ళే మార్గంలో పలు ఫిట్ నెస్ లేని వాహనాల కారణం గా ప్రమాదాలు గతంలో కొన్ని జరిగిన సంగతి తెలిసిందే. అయితే ముందు జాగ్రత్తగా పోలీసులు ఇటువంటి చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం అని చెప్పాలి.