జర్రున జారిపోయింది!

Wednesday, April 15th, 2015, 11:15:38 AM IST


దక్షిణ కొరియాలోని సియోల్ నుండి 74మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఏషియానా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ 320 విమానం హీరోషిమా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే జర్రున జారిపోయింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయి. కాగా ఈ విషయాన్ని జపాన్ అధికారిక వార్తాసంస్థ ఎన్ హెచ్ కే స్పష్టం చేసింది. ఈ నేపధ్యంగా హీరోషిమా విమానాశ్రయాన్ని మూసివేశారు.

ఇక ల్యాండింగ్ సమయంలో విమానం నేరుగా రన్ వేను తాకడంతో నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక ఈ ప్రమాదం మూలంగా ప్రయాణీకులను నేరుగా దించేందుకు వీలులేక అత్యవసర మార్గాల ద్వారా బయటకు తీసుకువచ్చారు. కాగా రెండేళ్ళ క్రితం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఏషియానా ఎయిర్ లైన్స్ విమానం కూలి 200మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.