అలా చేస్తే నా సగం మీసం తీసేస్తా…పుజారా కి అశ్విన్ ఓపెన్ ఛాలెంజ్!

Tuesday, January 26th, 2021, 04:39:04 PM IST

టీమ్ ఇండియా టెస్ట్ బ్యాటింగ్ లో అతి తక్కువ కాలం లోనే పుజారా అద్భుత ఆటగాడి గా రాణిస్తున్నాడు. అయితే పుజారా బ్యాటింగ్ విషయం లో పలువురు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ క్రికెట్ పెద్దల వరకూ వెళ్ళాయి. ఆచి తూచి ఆడే పుజారా గేమ్ ను ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడాల్సిందే. అయితే పుజారా ఇప్పటి వరకూ కూడా క్రీజు వదిలి ఆడటం చూడలేదు. అలా వచ్చి సిక్స్ కొట్టడం చాలా మంది అభిమానులకు తీరని కల అని చెప్పాలి. అయితే ఇదే విషయాన్ని టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ రాథోడ్ వివరించారు.

ఒక్కసారి అయినా క్రీజు వదిలి సిక్స్ కొట్టమని పుజారా కి చెబుతున్నా, కానీ అతడు మాత్రం వినడం లేదు, ఏవేవో కారణాలు చెబుతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదే వ్యవహారం పై బౌలర్ అశ్విన్ స్పందించారు. వచ్చే ఇంగ్లండ్ సిరీస్ లో మొయిన్ అలీ లేదా ఏదైనా స్పిన్నర్ బౌలింగ్ లో పుజారా అలా చేస్తే నా సగం మీసం తీసేసి అలాగే ఆడతాను అంటూ ఫన్నీ గా ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. అయితే అశ్విన్ చేసిన వ్యాఖ్యలకి రాథోడ్ స్పందిస్తూ, ఛాలెంజ్ బావుంది కానీ, పుజారా స్వీకరిస్తే బావుంటుంది, కానీ పుజారా అలాంటి పని చేయడు అంటూ చెప్పుకొచ్చారు.అతని డిఫెన్సివ్ ఆటతీరు అంతా తిడతారు కానీ,అతను నా ఫేవరేట్ బ్యాట్స్మ మన్ అంటూ చెప్పుకొచ్చారు.