సంచయితపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆశోక్ గజపతిరాజు..!

Tuesday, November 17th, 2020, 05:05:54 PM IST

మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌ సంచయిత గజపతిపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్ట్‌పై స్పందించిన అశోక్ గజపతిరాజు చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పోస్టులే మీ వ్యక్తిత్వం ఎలాంటిదనేది చెబుతుందని, ఎవరో పెట్టిన పోస్టులకు నేను సమాధానం చెప్పడం నా ఖర్మ అంటూ మాట్లాడారు.

అసలు తాత ఎవరో, తండ్రి ఎవరో సంచయితకు తెలియదని, తండ్రి, తాతను సంచయిత ఒక్కసారి కూడా కలవలేదని అన్నారు. మాన్సాస్ ఛైర్మన్ హోదా నుంచి తనను చట్టవిరుద్దంగా తొలగించారని, చైర్మెన్ పోస్ట్ ఆనవాయితీగా వచ్చేదని అన్నారు. తమ పూర్వీకులు నిర్వీహించే ఆలయాలకు ఒక్కసారి కూడా రానివారు, వాటి ఆస్తులపై కన్నేయడం బాధాకరమని అన్నారు. ట్రస్టు నియామకాల్లో ప్రభుత్వ పెద్దలు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, దేవాదాయ శాఖ చట్టం రాష్ట్రంలో అమలు కావడం లేదని ఆరోపించారు.