కరోనా టీకా తీసుకొని మృతి చెందిన ఆశా వర్కర్..!

Sunday, January 24th, 2021, 03:00:01 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న తరుణంలో పలు చోట్ల వాక్సిన్ కారణం గా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల వాక్సిన్ తీసుకున్న అనంతరం కొద్ది రోజులకి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, పెనుమాక కి చెందిన ఆశా వర్కర్ టీకా తీసుకున్న అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలను కోల్పోయారు.

ఈ నెల 19 వ తేదీన కరోనా వైరస్ వాక్సిన్ వేయించుకున్న విజయ లక్ష్మి ఆరోగ్యం రెండు రోజులు బాగానే ఉంది. అయితే ఈ నెల 21 తెల్లవారు ఝామునుండి, తీవ్ర చలి మరియు జ్వరం రావడం తో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన పట్ల కుటుంబీకులు, ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్ట పరిహారం తో పాటుగా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలి అని, ఇంటి స్థలం కూడా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.