మోడీ అలా చేస్తే రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లే – ఓవైసీ అసదుద్దీన్!

Tuesday, July 28th, 2020, 09:49:48 PM IST


వచ్చే నెల ఆగస్ట్ 5 న అయోధ్యా లో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ను ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోడీ సైతం వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై ఓవైసీ అసదుద్దీన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇపుడు అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చంశనేయం గా మారింది.

నరేంద్ర మోడీ ప్రధాని హోదా లో భూమి పూజ లో పాల్గొనడం అనేది రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు అని వ్యాఖ్యానించారు. లౌకిక వాదం రాజ్యాంగం లోని ప్రాథమిక నిర్మాణం లో ఒక భాగం అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇపుద్ సోషల్ మీడియా లో సైతం వైరల్ గా మారాయి. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక పక్క అయోధ్యా భూమి పూజ కొరకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.