బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నాం.. ఛాలెంజ్ విసిరిన అసదుద్దీన్..!

Wednesday, November 25th, 2020, 02:08:56 AM IST


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మేయర్ పీటం దక్కించుకున్న తర్వాత పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంది. అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నామని, పాతబస్తీలో పాకిస్తాన్ వాళ్లెవరున్నారో చెప్పాలని అన్నారు. భారత్ భూభాగంలో చైనా 970 చ.కి.మీల భూభాగాన్ని అక్రమించిందని దమ్ముంటే అక్కడకు వెళ్లి అమిత్‌షా సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు.

అంతేకాదు దేశంలో ఉన్నవాళ్లంతా భారతీయలేనని అన్నారు. దేశం నుంచి ముస్లింలను ఎవరూ వేరు చేయలేరని, దేశంలో అన్ని మతస్థుల వారు, కులాల వారు నివాసం ఉటున్నారని అన్నారు. బీజేపీ టెర్రరిస్టులు, పాకిస్తాన్‌ పదాలు లేకుండా ప్రచారం చేయగలదా అని ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే చదువు, అభివృద్ధి గురించి చెప్పి గెలవాలని అసదుద్దీన్ మండిపడ్డారు.