ప్రధాని నరేంద్ర మోడీ హిందుత్వ వాదానికి పునాది వేశారు – ఓవైసీ అసదుద్దీన్

Wednesday, August 5th, 2020, 08:24:03 PM IST


అయోధ్యా రామ మందిర నిర్మాణం భూమి పూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీ హజరు అయిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలంతా ఈ వేడుక ను చూస్తూ సంబరాలు జరుపుకున్నారు. అయితే నరేంద్ర మోడీ భూమి పూజ కి హజరు కావడం పట్ల హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హిందుత్వ వాదానికి పునాది వేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే మీడియా సమావేశం లో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ కి హజరు కావడం పట్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని కి ఏ ఒక్క మతం పై ప్రేమ ఉండకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మందిరం కానీ, ఒక మసీద్ కానీ దేశానికి ప్రతీక కాబొవ్ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ అయోధ్య భూమి వివాదం పై సుప్రీం కోర్టు కి బీజేపీ మరియు సంఘ్ పరివార అసత్యాలు చెప్పారు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యల పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.