డబ్బుతో అసద్ ను కొనే మనిషి ఇంకా పుట్టలేదు

Wednesday, December 16th, 2020, 03:56:09 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఎం ఐ ఎం పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లిం లను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టే బీజేపీ హైదరాబాద్ నుండి ఒక పార్టీని తీసుకు వచ్చింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పై అసద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుతో అసద్ ను కొనే మనిషి ఇంకా పుట్టలేదు అని అన్నారు.

అయితే ముస్లిం ఓట్లు మమతా జాగీరు, ఆస్తులు కాదని అన్నారు. అయితే ఆమె చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఆమె ఎంతో ఆందోళన చెందుతున్నారు అని, ఆమె నాయకులు బీజేపీ లో చేరుతున్నారు అని అన్నారు. సొంత రాష్ట్రం లోనే ఆమె భయపడుతున్నారు అని అన్నారు. పార్టీ వైఫల్యాలను కప్పి పుచ్చెందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది గుర్తు పెట్టుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.