శ్రీకృష్ణ జన్మభూమి వివాదం మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదు – అసదుద్దీన్ ఓవైసీ

Sunday, September 27th, 2020, 08:00:10 PM IST

మధుర సివిల్ కోర్టు లో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం పై అడ్వకేట్ విష్ణు జైన్ దావా వేశారు. అయితే శ్రీకృష్ణ జన్మభూమి వివాదం ను మళ్లీ తెరపైకి తేవడం పట్ల ఏ ఐ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ జన్మస్తాన్ సేవా సంఘం మరియు షాహీ ఈద్గా ట్రస్ట్ ల మధ్య తలెత్తిన వివాదం 1968 లో పరిష్కారం అయింది అని, అయితే ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదు అంటూ అసదుద్దీన్ స్పష్టం చేశారు. అంతేకాక ప్రార్ధనా స్థలాల చట్టం 1991 ప్రార్ధనా స్థలాల మార్పిడి ను నిరోధిస్తుంది అను, ఈ చట్టం అమలు బాధ్యత హోమ్ మంత్రిత్వ శాఖ కి అప్పగించారు అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

అయితే అలాంటి అంశాన్ని కోర్టు లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే గతంలో ఎన్నడో పరిష్కారం అయిన ఈ వివాదం ను తెరపైకి తేవడం పై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ జన్మభూమి లోని మొత్తం 13.37 ఎకరాలను విష్ణు జైన్ తెలిపారు. భూమిలోని ప్రతి అంగుళం కూడా శ్రీ కృష్ణ భగవాన్ భక్తులకు మరియు, హిందువులకు పవిత్రమైంది అని అన్నారు. 1968 లో కుదిరిన రాజీ ఫార్ములా కి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని, షాహీ ఈద్గా మసీద్ తొలగించాలని, ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేశారు అని అందులో పేర్కొన్నారు. అయితే ఈ అంశం పై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.