అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కి సోకిన కరోనా

Wednesday, September 16th, 2020, 01:04:06 AM IST

Corona_india
భారత దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా ప్రజా ప్రతినిదులు, ప్రముఖులు, ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తనకు కరోనా వైరస్ సోకడం పట్ల సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

తను ఆర్ టీ పీసిఆర్ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నా అని తెలిపారు. అందులో తనకు పాజిటివ్ వచ్చింది అని అన్నారు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేవు అని, సంపూర్ణ ఆరోగ్యం గా ఉన్నట్లు తెలిపారు. అయితే ఏది ఏమైనా ఇతరుల భద్రత కోసం తాను ఐశోలేశన్ లో ఉంటున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితులు కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని ముఖ్యమంత్రి కోరారు. అయితే రోజుకి వేలల్లో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.