ఎయిర్ ఏషియా విమానం కూలిన ప్రదేశం గుర్తింపు!

Friday, January 2nd, 2015, 02:49:31 PM IST


ఇండోనేషియా నుండి సింగపూర్ వెళ్తూ మార్గం మధ్యలో ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. కాగా జావా సముద్రంలో విమానం కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించామని ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నామని ఇండోనేషియా నేవీ చీఫ్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 16 మృతదేహాలు దొరికాయని, మిగిలిన వాటి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఇక సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, అమెరికా దేశాలకు చెందిన 90కి పైగా నౌకలు, పెద్ద సంఖ్యలో విమానాల గాలింపులో పాలు పంచుకుంటున్నాయి. కాగా ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యల్లో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇక కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానంలో 162మంది ప్రయాణించిన సంగతి తెలిసిందే.