సీఎం జగన్ రెండు పెద్ద అడ్డ గాడిదలను కాస్తున్నారు – అప్పిరెడ్డి

Tuesday, February 16th, 2021, 07:26:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాడిదలు కాస్తున్నారా అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల కి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి రాష్ట్రంలో బరి తెగించి తిరుగుతున్న రెండు పెద్ద అడ్డ గాడిదలను కాస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిలో ఒకటి చంద్రబాబు కాగా, రెండోది లోకేష్ అంటూ సెటైర్స్ వేశారు. అయితే చంద్రబాబు నాయుడు పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి జీర్ణించుకోలేక పోతున్నారు అని అన్నారు.

అయితే గతంలో ఈవిఎం ల వల్ల మోసం జరిగింది అని మాట్లాడిన చంద్రబాబు కి బ్యాలెట్ పేపర్ల తోనూ ప్రజలు గుణపాఠం చెప్పారు అంటూ విమర్శించారు. చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ విశాఖ లో మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తుంది అని అన్నారు. ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నాడు అనే బాధ కూడా కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రపంచం లోనే పేరొందిన స్తాన్ ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్నా అని చెప్పుకొనే లోకేష్, అక్కడ చదివి నేర్చుకున్న సంస్కారము ఇదేనా అంటూ సూటీగా ప్రశ్నించారు. దుష్ప్రచారం, అవాస్తవాలు, అబద్ధాలు, కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్ లాంటి రెండు గాడిదల నుండి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాపలా కాస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే లేళ్ల అప్పిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే దీని పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.