ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే కోర్టుకి వెళ్తాం

Wednesday, November 4th, 2020, 07:37:09 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా, ఈ మహమ్మారి మళ్లీ భారీ స్థాయిలో కేసులను నమోదు చేసుకుంటుంది. అయితే ఇలాంటి పరిస్తితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కి కోర్టుకు కూడా వెళ్తాం అని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ కూడదు అని, అందుకు ఎన్నికల సంఘంను కోరతామని తెలిపారు. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో ఎన్నికలను నిర్వహిస్తే ఉద్యోగులను రక్షించుకునేందుకు అవసరం అయితే కోర్టుకి కూడా వెళ్తాం అని హెచ్చరికలు జారీ చేశారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూడు రాజధానులకి ఉద్యోగులు సైతం అనుకూలం గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ పరిపాలన రాజధాని గా అవతరిస్తున్న నేపద్యం లో ఉద్యోగులు అంతా విశాఖ కి వచ్చేందుకి సిద్దం గా ఉన్నారు అని తెలిపారు. అయితే ఈ సీపీ ఎస్ రద్దు పై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం అని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అని వివరించారు. ఈ కీలక సమావేశం లో పలువురు అధికారులు పాల్గొన్నారు.