ఖాకీ డ్రెస్ అంటేనే విరక్తి కలుగుతోంది – అచ్చెన్నాయుడు

Tuesday, February 2nd, 2021, 03:18:52 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ నేపథ్యం లో అధికార పార్టీ వైసీపీ, ప్రతి పక్ష టీడీపీ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మేరకు నిమ్మాడ లో జరిగిన సంఘటన తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లోని బెడ్ రూం లోకి చొచ్చుకు వచ్చి అరెస్ట్ చేయడం పట్ల అచ్చెన్న పోలీసుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మళ్ళీ తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తే తానే హోం మంత్రి అవుతాను అని అన్నారు. చంద్రబాబు ను ఒప్పించి హోం మంత్రి పదవి తీసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు. అయితే తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడ ఉన్నా వదిలేది లేదు అని, తాను నాయకులను తప్పు పట్టడం లేదు అని, పోలీసులను తప్పు పడుతున్నా అని అన్నారు. అయితే డిఎస్పీ, సీఐ లు తన బెడ్ రూం లోకి వచ్చారు అని, నోటీసులు ఇస్తే తానే వచ్చే వాడిని అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖాకీ డ్రెస్ అంటేనే విరక్తి కలుగుతోంది అని, పోలీసులను చూసి ఉద్యోగులు సిగ్గు పడుతున్నారు అంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.