వాటిని దోచుకునేందుకే ప్రైవేటీకరణ…వైసీపీ పై అచ్చెన్న సీరియస్ కామెంట్స్

Friday, February 12th, 2021, 12:57:26 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయం లో ప్రతి పక్ష పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత పల్లా శ్రీనివాస రావుచేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు ఇస్తూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల విలువైన ప్లాంటు భూములను దోచుకునేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ భూములను దోచుకునేందుకు విశాఖ లో పరిపాలన రాజధాని ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అని ఆరోపణలు చేశారు.

అయితే ఓబుళాపురం గనులు స్టీల్ ప్లాంట్ కి కేటాయిస్తే వైజాగ్ కి ఈ పరిస్తితీ ఉండేది కాదు అని వ్యాఖ్యానించారు.అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణ త్యాగం చేశారు అని మరొకసారి గుర్తు చేశారు. అయితే ఈ నేపథ్యం లో టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాస్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లో లేదని మరొకసారి కార్మిక సంఘాల సమక్షం లో గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కార్మిక సంఘాల పోరాటానికి తన మద్దతు ఉంటుంది అని తెలిపారు. అయితే ఈ అంశం పై మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అంతేకాక రోజుకొక కార్యక్రమం తో ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తూ, ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని గంటా శ్రీనివాస్ తెలిపారు.