ఆలయాల పై దాడులు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు

Wednesday, January 20th, 2021, 12:53:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి, ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ ఒకరు పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజుకో వేషం తో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ విమర్శించారు. రాష్ట్రం లో హిందూ దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులకు సంబంధించి ప్రజలు ఆగ్రహం గా ఉన్నారు అంటూ అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అయితే వాటిని గ్రహించి ఆలయాలకు శంకుస్థాపనలు, గో పూజలు చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే లౌకిక వాదమే తెలుగు దేశం సిద్దాంతం అంటూ అచ్చెన్న చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల కొన్ని వర్గాలు తమ పై అనవసర విమర్శలు చేస్తున్నారు అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ది పొందుతుంది అంటూ చెప్పుకొచ్చారు.ఆలయాల పై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటూ సూటి గా ప్రశ్నించారు. అయితే అటు గొల్లపూడి లో దేవినేని ఉమా నిరసన దీక్ష, ఇటు అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.