నిమ్మాడ లో అచ్చెన్నాయుడు అరెస్ట్

Tuesday, February 2nd, 2021, 09:31:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను పోలీసులు నిమ్మాడ లో అరెస్ట్ చేశారు. కోట బొమ్మాళి లో అచ్చెన్నాయుడు పై కేసు నమోదు అవ్వడం తో పోలీసులు అరెస్ట్ చేశారు. సర్పంచ్ అభ్యర్దిని బెదిరించినట్లు ఆరోపణలు రావడం తో పోలీస్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే కోట బొమ్మాళి పి ఎస్ కి అచ్చెన్నాయుడు ను పోలీసులు తరలించారు. రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ సమయం లో టీడీపీ మరియు వైసీపీ అభ్యర్థుల మధ్యన తోపులాట జరిగింది. అయితే వైసీపీ బలపరిచిన వ్యక్తి వేరే గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఘర్షణ వాతావరణం ఉండటం, పరిస్థితులు ఉద్రిక్తం గా మారడం తో వైసీపీ అభ్యర్ధి తో పాటుగా పలువురు నేతలు అక్కడికి వెళ్ళారు. అయితే ఈ మొత్తం నేపథ్యం లో పోలీసులు కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్ లో 22 మంది పై కేసు నమోదు చేశారు, నిన్న 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అచ్చెన్న తీరు పై వైసీపీ నేతలు సైతం విమర్శలు చేశారు.