ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం…వీడియో రికార్డింగ్ కానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ!

Monday, August 17th, 2020, 05:19:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇక పై స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను వీడియో రికార్డింగ్ చేయాలని భావిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక పై వీడియో రికార్డింగ్ చేసేందుకు, పర్యవేక్షణ కి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం కాస్త వినూత్నమైన నిర్ణయం అని, పారదర్శకం గా చర్యలు తెలుసుకునేందుకు కీలకం కానున్నాయి.

అయితే ఇందుకు తగ్గట్లుగా రెవెన్యూ శాఖ అధికారులు ప్రస్తుతం కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముందుగా ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించనున్నారు. మెల్లమెల్లగా ఇదే ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రెవెన్యూ శాఖ నేడు వెల్లడించడం జరిగింది. ఈ ప్రక్రియ ను రాష్ట్ర స్థాయిలో కూడా పర్యవేక్షించెలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.