ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. జూలై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం..!

Wednesday, February 3rd, 2021, 06:44:15 PM IST

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 5 వరకు పదవ తరగతి క్లాసులు నిర్వహిస్తామని జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఈ సారి 7 పేపర్లుగా పరీక్షలు ఉంటాయని సైన్స్‌ను రెండు పేపర్లుగా విభజించి ఒక్కో పేపర్‌కు 50 మార్కులు కేటాయించినట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 1 నుంచి అన్ని పాఠశాలలు యధాతధంగా పనిచేస్తాయని చెప్పిన మంత్రి ఆదిమూలపు సురేశ్ మే 3 నుంచి 15 వరకు 1 నుంచి 9వ తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే మే 5 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. ఇక జూలై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పుకొచ్చారు.