సర్పంచ్ గా గెలుపొందిన తమ్మినేని సీతారాం సతీమణి

Thursday, February 18th, 2021, 09:22:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ సర్పంచ్ గా గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస మండలం, తోగురాం సర్పంచ్ గా వాణిశ్రీ విజయం సాధించారు. ప్రత్యర్ధి పై 510 ఓట్ల భారీ తేడా తో విజయం సాధించారు. అయితే ఫలితాలు వెల్లువడిన అనంతరం వాణిశ్రీ కి వైసీపీ కార్యకర్తలు పూల మాలలు వేసి సత్కారం చేశారు. గెలిచిన అనంతరం తోగురామ్ గ్రామం లో ఊరేగింపు నిర్వహించారు కార్యకర్తలు. అయితే తొలి విడత పంచాయతీ ఎన్నికల నుండి మూడవ విడత వరకూ కూడా వైసీపీ తమ ఆధిపత్యం కనబరుస్తోంది. ఎక్కువ స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్ధులు తమ సత్తా చాటుతూ విజయం సాధించారు.