బ్రేకింగ్: స్పీకర్ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం..!

Saturday, November 21st, 2020, 04:11:48 PM IST

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వాకలవలస వద్ద స్పీకర్ తమ్మినేని కారు ఆటోను ఢీకొట్టింది. రాజోలు-పంజంగి మధ్యలో తమ్మినేని కారుకు ఆటో అడ్డుగా వచ్చింది. దీంతో ఆటోను స్పీకర్ కారు బలంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. స్పీకర్ కారు పొలాల్లోకి దూసుకెళ్ళడంతో స్వల్ఫంగా దెబ్బతింది. శ్రీకాకుళం నుంచి స్పీకర్ తమ్మినేని ఆముదాలవలస వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారు.