ఆ రెండు బిల్లులపై స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Friday, August 7th, 2020, 05:01:30 PM IST

ఏపీ మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై సభలో 11 గంటల పాటు చర్చించామని, ప్రతిపక్ష పార్టీకి కూడా 2.17 గంటల పాటు సమయం ఇచ్చామని అన్నారు.

అయితే టీడీపీ సభ్యుల సంఖ్యా బలం కన్నా ఎక్కువ సమయం ఇస్తే అసలు సభలో బిల్లులపై చర్చనే జరగలేదని అనడం సరికాదని అన్నారు. అసెంబ్లీ నిర్ణయాలపై కోర్టుల జోక్యం చేసుకోరాదని, 1997 సంవత్సరంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చారని ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన చర్చలపై కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయని ప్రశ్నించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు సెలక్ట్ కమిటీలో ఉన్నాయని కొందరు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు.