బిగ్ న్యూస్: అసెంబ్లీ నుండి చంద్రబాబు ను సస్పెండ్ చేసిన స్పీకర్

Tuesday, December 1st, 2020, 01:30:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నివర్ తుఫాను కారణంగా రైతులు తీవ్ర స్థాయిలో నటపోయారు. అయితే ఇదే అంశం పై చంద్రబాబు తో సహ టీడీపీ నేతలు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సభ లో ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు తో సహ పలువురు ఎమ్మెల్యే లను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే నెల రోజుల్లోనే నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ నిధులు అందజేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు తీరు పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం చేస్తున్న పనికి ప్రతి పక్షం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని జగన్ అన్నారు. అయితే చంద్రబాబు తో పాటుగా, టీడీపీ ఎమ్మెల్యే లు పోడియం ఎదుట బైఠయించడం పట్ల వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రవర్తన సరైనది కాదు అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. చంద్రబాబు కళ్లు పెద్దవి చేస్తూ, వేలు చూపించి బెదిరించారు అని సీఎం జగన్ ఆక్షేపించారు. అయితే ఇలాంటి పనులు మళ్లీ పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ను వైసీపీ నేతలు కోరారు.